పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయి పెంచదు : జూనియర్ ఎన్టీఆర్

గురువారం, 22 సెప్టెంబరు 2022 (15:48 IST)
విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్ స్థాయి తగ్గిపోదన్నారు. 
 
ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, చివరి రోజు అయిన బుధవారం నాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ వైకాపా ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టి దానికి ఆమోదం తెలిపింది. 
 
అయితే, వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై టీడీపీ సహా పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురువారం ఈ వ్యవహారంపై తన సోషల్ మీడియాలో స్పందిచారు. 
 
"ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదన్నారు. 
 
'విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు' అని అంటూ పరోక్షంగా ఏపీ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.

 

pic.twitter.com/5kD5fiNZ12

— Jr NTR (@tarak9999) September 22, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు