జగన్మోహన్ రెడ్డికి నవ్వుతూ అబద్దాలు చెప్పడం అలవాటైపోయింది..?

గురువారం, 17 మార్చి 2022 (17:46 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నవ్వుతూ అబద్దాలు ఆడడం అలవాటైపోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. జంగారెడ్డి గూడెం కల్తీ మరణాలు సహా అన్ని విషయాల్లోనూ సీఎం జగన్ అలవోకగా అబద్దాలు ఆడేస్తున్నారు. పేదల ప్రాణాలంటే జగనుకు ఎంత లోకువో జంగారెడ్డి గూడెం వరుస మరణాల ఘటనతో స్పష్టమైందని చెప్పుకొచ్చారు. జంగారెడ్డి గూడెంలోవి సహజ మరణాలైతే ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేశారని చెప్పారు. 
 
ఒకే సామాజిక వర్గానికి చెందిన 37 మందికి ప్రమోషన్లు ఇచ్చారంటూ మాపై రాష్ట్రపతికే ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, ప్రధానిలకే అబద్దాలు చెప్పగలిగిన ఘనుడు జగన్ అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. పెగాసస్ సాఫ్ట్ వేరును టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. చట్ట వ్యతిరేక పనులను చంద్రబాబు ఎప్పుడూ అనుమతించరు. పెగాసెస్ సాఫ్ట్ మేం కొనుగోలు చేసి ఉంటే జగన్ అధికారంలోకే వచ్చేవారా..? అని లోకేష్ ప్రశ్నించారు.
 
చంద్రబాబు ముందు చూపు వల్లే సీఆర్డీఏ చట్టం గెలిచింది. రాజధానిపై ప్రభుత్వానికే స్పష్టత లేదు.. మాకు స్పష్టత ఉంది. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని మా విధానం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. పరిపాలన కేంద్రీకృతంగా ఉండాలని నారా లోకేష్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు