త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న తరుణంలో ప్రస్తుత మంత్రులకు భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరిని మంత్రుల పదవుల నుంచి తొలగిస్తారేమోనని వణికిపోతున్నారు. ప్రధానంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో పాటు ఐటీ, సమాచార శాఖామంత్రి పల్లె రఘునాథ రెడ్డి, పీతల సుజాత, రావెళ్ళ కిషోర్ బాబులకు పదవులు పోయినట్లేనని ఇప్పటికే వదంతులు వినిపిస్తున్నాయి. సమాచార శాఖామంత్రిగా ఉన్న పల్లె రఘునాథ రెడ్డికి మాత్రం పదవి పోదు గానీ ఆయనకు కేటాయించిన ఒక శాఖను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.