Rashmika : బాక్సాఫీస్ నెంబర్స్, సక్సెస్ కంటే మంచి కథయిన ది గర్ల్ ఫ్రెండ్ చేశా: రశ్మిక మందన్న

చిత్రాసేన్

శనివారం, 25 అక్టోబరు 2025 (18:14 IST)
Rashmika Mandanna, Dixit Shetty
రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి  జంటగా నటిస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
 
రశ్మిక మందన్న మాట్లాడుతూ -  కథ విన్నప్పుడు ఇలాంటి లవ్ స్టోరీని ఇప్పటిదాకా మనం చూడలేదు అనిపించింది. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అనే ఫీల్ కలిగింది. ఇందులో భూమా అనే పాత్రలో నటించాను. కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ తోనే కొన్ని మన విషయాలు షేర్ చేసుకుంటాం. అలాంటి కంటెంట్ ఉన్న మూవీ ఇది. మా మూవీ ట్రైలర్ చూశారు కదా మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నా. నేను చాలా మూవీస్ చేస్తున్నా గానీ "ది గర్ల్ ఫ్రెండ్"  లాంటి సినిమా చేయడం ముఖ్యమని భావించాను. నాకు బాక్సాఫీస్ నెంబర్స్, సక్సెస్ కంటే మంచి మూవీ చేయాలి, మంచి కథను ఆడియెన్స్ కు చెప్పాలనే అనిపిస్తుంది. నా మూవీ థియేటర్స్ కు వెళ్లి చూసిన ఆడియెన్స్ ఏదో ఒక మంచి ఫీల్ తో బయటకు వెళ్లాలని కోరుకుంటాను. నేను నా కెరీర్ లో రైట్ టైమ్ లో కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి మంచి టీమ్ లేకుంటే మన డ్రీమ్స్ నిజం కావు. దీక్షిత్ లాంటి కోస్టార్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మీరంతా మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ - దసరా మూవీ తర్వాత మళ్లీ మీ అందరినీ మీట్ అవడం హ్యాపీగా ఉంది. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మీరంతా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఇంటెన్స్ గా ఫీల్ అయి ఉంటారు. నేను ఈ కథ విన్నప్పుడు ఆ కథ నుంచి బయటకు రాలేకపోయాను. అంత మంచి స్టోరీని రాహుల్ మా దగ్గరకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో విక్రమ్ అనే క్యారెక్టర్ చేసే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. దసరా సినిమాలో సూరి క్యారెక్టర్ ను మీరు ఎంతగా ఇష్టపడ్డారో ఈ చిత్రంలో విక్రమ్ ను అంతగా ఇష్టపడటంతో పాటు ద్వేషిస్తారు. గర్ల్ ఫ్రెండ్ ను ఎలా మ్యానేజ్ చేయాలో నేర్చుకుంటారు. ఈ రోజు అబ్బాయిలు ఎలా ఉన్నారో నా క్యారెక్టర్ ద్వారా చూసుకోవచ్చు. నవంబర్ 7న థియేటర్స్ కు వచ్చి మా మూవీని సపోర్ట్ చేయండి. చాలా ప్యాషనేట్ గా ఈ చిత్రానికి వర్క్ చేశాం. "ది గర్ల్ ఫ్రెండ్"  సినిమాలో నటిస్తున్నప్పుడు మేము ఎంతగా ఎంజాయ్ చేశామో, చూస్తున్నప్పుడు మీరూ అలాగే ఆస్వాదిస్తారు. అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు