నరసాపురం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో సందర్భంగా వైసీపీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కో ఆప్షన్ సభ్యుల పేర్లను ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వర్గం కౌన్సిలర్లు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గం కౌన్సిలర్లు వేర్వేరుగా ప్రతిపాదించారు.
ఎమ్మెల్యే ముదునూరి వర్గం మాజీ కౌన్సిలర్ ఏడిదకోట సత్యనారాయణ అభ్యర్ధిత్వానికి, కొత్తపల్లి వర్గం మాజీ కౌన్సిలర్ బల్ల వెంకటేశ్వరరావుకు మద్దతు ఇచ్చింది. వైసీపీలో వర్గ విబేధాల నేపథ్యంలో ఎన్నిక నిలిచిపోయింది. అటు కౌన్సిల్లో హైడ్రామా కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై పార్టీ అధినేతలతో మంతనాలు సాగుతున్నాయి.
కొత్తపల్లి సుబ్బారాయడు 1989లో నర్సాపురం నుంచి టీడీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1994, 1999, 2004లో కూడా గెలిచారు. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు చేతిలో ఓడారు.