ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే రెండు దశలు ముగిసిపోయాయి. బుధవారం మూడో దశ పోలింగ్ జరుగనుంది. అయితే, తొలి, రెండు దశల ఎన్నికల్లో గెలుపొందిన పలువురు అభ్యర్థులు వైకాపాలోకి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా, తెలుగుదేశం పార్టీ బలం, మద్దతుతో గెలుపొంది, ఇపుడు అధికార పార్టీలోకి దూకేస్తున్నారు.
సంగం మండలం చెర్లోవంగుల్లులో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ పి.రఘురామయ్య అనుచరుడు కె.రామయ్య సర్పంచ్‌గా విజయం సాధించారు. అనంతరం మాజీ సర్పంచ్‌తో కలిసి ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మంత్రి గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇద్దరూ వైసీపీలో చేరారు.