అయితే.. మాస్క్ కంపల్సరీ ధరించే నిబంధన, మార్గదర్శకాలు కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సమావేశం నిర్ణయించింది. ఫీవర్ సర్వే కొనసాగించాలన్న సీఎం జగన్ ఆదేశించారు.
లక్షణాలు ఉన్న వారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తి చేయాలని, సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు సీఎం జగన్.