తోటి విద్యార్థునులు భోజనం చేసేందుకు వెళ్లగానే ఆమె గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులకు తెలిపింది కాలేజీ యాజమాన్యం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసారు. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.