ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వివాదాస్పదమవుతోంది. దీంతో కోర్టులో మొటిక్కాయలు తప్పడం లేదు. తాజాగా పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావించింది. అలాగే, అమరావతి కోసం భూములిచ్చిన రైతుల హక్కులను కాపాడేందుకు వీలుగా సీఆర్డీయే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు, మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్ ఆమోదముద్రవేశారు. ఇదే అదునుగా భావించిన ఏపీ సర్కారు అమరావతిలోని కార్య నిర్వాహక ప్రధాన కార్యాలయన్నీ విశాఖపట్టణానికి తరలించేందుకు పూనుకుంది. అంతేకాకుండా, సీఆర్డీఏ చట్టం రద్దుపై గవర్నర్ ఆమోదముద్రవేయగానే, సీఆర్డీఏ వెబ్‌సైట్ కూడా మాయమైపోయింది.
అయితే... మూడు రాజధానులు, ఏపీసీఆర్డీయే చట్టం రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్పందిస్తూ... ఈనెల 14 వరకు 'యథాతథస్థితి' కొనసాగించాలని ఆదేశించింది. దీంతో.. అధికారులు మళ్లీ వెబ్‌సైట్‌ను ఏపీసీఆర్డీయేగా మార్చేశారు.