నెల్లూరులో ఆక్సిజన్ కొరతతో ఒకేసారి ఆరుగురు మృతి

బుధవారం, 5 మే 2021 (20:19 IST)
నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ మరణ మృదంగం వినిపిస్తోంది. ముఖ్యంగా, జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం ఆరుగురు కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఆక్సిజన్ కొరత కారణంగా వీరంతా చనిపోయారు. అయితే, వీరంతా ఆక్సిజన్ కొరత వల్లే చనిపోయారా లేదా అనే విషయంపై జిల్లా ఆరోగ్య శాఖ స్పందించలేదు. 
 
మరోవైపు, గూడూరులోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో గత ఐదు రోజుల్లో ఐదుగురు కోవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. వీరంతా ఆక్సిజన్ కొరత కారణంగానే చనిపోయారు. అంతేకాకుండా, జిల్లాలోని అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉన్నట్టు వార్తలు వస్తూనేవున్నాయి. ఇదిలావుంటే, ఆక్సిజన్ కొరత కారణంగా జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులను బలవంతంగా డిశ్చార్జ్ చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు