దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పించిన పవన్ కళ్యాణ్ (Video)

ఠాగూర్

ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (14:16 IST)
కాకినాడలోని రంగరాయ ప్రభుత్వ వైద్య కాలేజీ ఆవరణలో జరిగిన చిన్నపాటి గొడవ పెను వివాదానికి దారితీసింది. ఇందులో జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ జోక్యం చేసుకుని చిక్కుల్లో పడ్డారు. వైద్య కాలేజీకి చెందిన ఒక విభాగ అధిపతిని పరుష పదజాలంతో దూషించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ విషయం జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. అంతే.. సొంత పార్టీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పంతం నానాజీపై కేసు నమోదు చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే పంతం నానాజీ దిగివచ్చారు. 
 
విద్యార్థులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులు, ప్రజల సమక్షంలో బాధితుడుకి భేషరతు క్షమాపణలు చెప్పారు. కేసు నమోదు చేయొద్దని పోలీసులను ప్రాధేయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు శెభాష్ పవన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ సమయంలో ఘటనా స్థలంలో ఉన్న వైద్యులు, అధికారులు, కలెక్టర్, విద్యార్థులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ అందించిన స్వేచ్ఛయుత ప్రజాస్వామ్యం, జగన్ ప్రభుత్వంలో ప్రజలు కోల్పోయిన చాలా అంశాల్లో ఇదొకటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


 

పౌర సమాజం సమక్షంలో తప్పు చేసిన తన MLA చేత క్షమాపణ చెప్పించిన పవన్ కళ్యాణ్...

అక్కడ డాక్టర్లు, అధికారులు, కలెక్టర్ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం చూడొచ్చు

ఇది @PawanKalyan ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన స్వేచ్ఛయుత ప్రజాస్వామ్యం...

జగన్ ప్రభుత్వంలో ప్రజలు… pic.twitter.com/IrQbjuUS7B

— Political Missile (@TeluguChegu) September 22, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు