మంగళగిరి వేదికగా జరిగిన పార్టీ కీలక సమావేశంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి సుధీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికార పార్టీ వైకాపాతో పాటు.. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌కు మైండ్ సిరిగా ఉందా అని ప్రశ్నించారు. జగన్ మానసికస్థితి సరిగ్గా ఉందా అనేది మనం నిర్ధారించుకోవాలన్నారు. ఈ వ్యాఖ్యలను తాను సరదాగా చేయడం లేదన్నారు. ఆయన రాజ్యాంగ విరుద్ధిమైన పనులు చాలా చేస్తున్నారని అన్నారు.
అలాగే, వైకాపా ఒక పీడ.. ఓ చీడ పార్టీ అని మండిపడ్డారు. వైకాపా, జగన్‌పై తాను చేసే వ్యాఖ్యలు సరదాగా చేయడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పేపర్ చదువుతూ తనను తిట్టాలనుకున్నా తడబాటే. పిచ్చి ఉన్నవాళ్లు మాత్రమే ఇలా చేస్తారు. ఏ సైక్రియాటిస్టుకు చూపించినా... ఆయనకు మానసిక అనారోగ్యం ఉందని చెబుతారన్నారు.
జగన్ మానసిక పరిస్థితిని తెలుసుకునేందుకు ఢిల్లీ నుంచి ఒక వైద్య బృందాన్ని పంపించాలని కేంద్రాన్ని అడగాలనిపిస్తుంది. ఏపీని మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతుల్లో పెట్టడం కరెక్టు కాదు. ముఖ్యంగా వైసీపీకి చెబుతున్నాను. జగన్‌ది బలం కాదు. అది పిచ్చి. జగన్ క్రూరుడు. విపరీతమైన దురాశ. తన దగ్గర తప్ప ఎవరి దగ్గరా డబ్బు ఉండకూడదు, తెల్ల చొక్కాలు వేసుకోకూడదు అనుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు.