జనసేనకు భారీ షాక్.. వైసీపీలోకి కల్యాణ్ దిలీప్ సుంకర జంప్?

శనివారం, 31 మార్చి 2018 (10:52 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి గట్టి దెబ్బ తగలనుంది. జనసేన కార్యకర్తగా, పవన్ వీరాభిమానిగా వున్న కల్యాణ్ దిలీప్ సుంకర జనసేనను వీడనున్నట్లు తెలుస్తోంది. పవన్ తర్వాత ఆ రేంజ్‌‌లో జనసేనలో పలుకుబడి వున్న దిలీప్ సుంకర.. దాదాపు జనసేనకు గుడ్ బై చెప్పినట్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో దిలీప్ సుంకర ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. క్లారిటీ ఇచ్చారు. తన విషయంలో జనసేన పార్టీ పెద్దలు పలు రకాలుగా అధినేత పవన్‌కు ఫిర్యాదులు చేసినట్లుగా కల్యాణ్ దిలీప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. 
 
అంతేకాకుండా తనకు జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పవన్ దగ్గర ఒక్క మాట చెప్పించండి లేదా ప్రెస్ నోట్ ఇప్పించండి అని కల్యాణ్ దిలీప్ ఆ పార్టీ పెద్దలను, పీఆర్వోను కోరిన సంగతి విదితమే. అయితే తనను వైసీపీ కోవర్టు అని ఆరోపించడంపై దిలీప్ సుంకర మండిపడ్డారు. ఎక్కువ శాతం అవమానాలు తీసుకునే ఓపిక లేదు. ఎవరుబడితే వాళ్లు తనను వైసీపీ కోర్టునని చెప్తే.. ఆ మాటలను స్వీకరించే శక్తి తనకు లేదని చెప్పారు. తాను తక్షణ నిర్ణయాలు తీసుకునే వ్యక్తినని.. ఇంకోసారి ఎవరైనా తనను వైసీపీ కోవర్టు అంటే మాత్రం బాగోదని చెప్పుకొచ్చారు. 
 
ఇలా కోర్టు అనే పరిస్థితులను పార్టీ కల్పిస్తుందో.. పార్టీ అలా అనమని చెప్తుందో తెలియదు కానీ పదే పదే వైసీపీ కోవర్టు అంటే మాత్రం తాను కచ్చితంగా వైసీపీలోనే చేరుతానని కల్యాణ్ దిలిపీ ఎఫ్‌బీ లైవ్‌లో తేల్చేశారు. తాను ఎక్కడైనా పనిచేయగలనని.. లేనిపోని అబాండాలు వేస్తే మాత్రం సహించేది లేదని దిలీప్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని చూస్తే దిలీప్ పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. కానీ ఎప్పుడు.. ఏ పార్టీలోకి జాయిన్ అవుతారనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఇంత తతంగం జరుగుతున్నా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం దిలీప్ వ్యవహారంలో నోరెత్తలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు