జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థత... ఎన్నికల ప్రచారానికి విరామం!!

ఠాగూర్

సోమవారం, 1 ఏప్రియల్ 2024 (09:47 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయన శనివారం ప్రచారం కొనసాగించారు. ఆదివారం కూడా తాను పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంలో వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. షెడ్యూల్ ముద్రస్తుగా ఖరారు కావడంతో అనారోగ్యంతోనే ప్రచారం కొనసాగించారు. అయితే, ఆయనకు జ్వరం, దగ్గులు సోమవారానికి ఎక్కువైంది. 
 
పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీ షెడ్యూల్ ముందస్తుగానే ఖరారైంది. దీంతో ప్రచారం వాయిదా వేయడం ఇష్టం లేక ఆయన ప్రచారానికి హాజరయ్యారు. ఆరోగ్యం సహకరించకున్నప్పటికీ వైద్యం పొందుతూనే శనివారం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. 
 
ఆదివారం శక్తిపీఠాన్ని సందర్శించుకున్న అనంతరం జనసేన - టీడీపీ - బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు శ్రేణులకు పలు సూచనలు చేశారు. అత్యవసర సమావేశం కోసం ఆదివారం సాయంత్రం హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ వెళ్లిన పవన్ కళ్యాణ్, సోమవారం ఉదయం మళ్ళీ పిఠాపురం చేరుకుని మిగిలిన పర్యటన పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు