రిటైర్డ్ ఐఏఎస్ అదికారి శర్మ లేఖకు స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ .. ఏంటా లేఖ?

వరుణ్

ఆదివారం, 14 జులై 2024 (19:45 IST)
రిటైర్డ్ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ రాసిన లేఖపై జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ముడసర్లోవ పార్కును పరిరక్షించాలంటూ ఆయన కోరారు. ఆయన సూచనను పరిగణనలోకి తీసుకున్న పవన్.. ముడసర్లోవ అడవుల సంరక్షణపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 
 
పరిపాలనకు కొత్త అయిన పవన్ కళ్యాణ్... అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఈ క్రమంలో మాజీ రిటైర్డ్ అధికారి ఈఏఎస్ శర్మ ముడసర్లోవ అడవులపై లేఖ రాశారు. ముడసర్లో వద్ద జీవీఎంసీ నిర్మాణాలు పర్యావరణానికి హాని చేస్తాయని శర్మ తన లేఖ రాశారు. నిత్యం వందలాది మంది ప్రజలు సందర్శించే ముడసర్లోవ పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని, జీవీఎంసీ ఆ పార్కులో భవనాల నిర్మాణానికి సిద్ధం అవుతుందని వచ్చిన వార్తలను ఉటంకిస్తూ ముడసర్లోవ పార్కును పరిరక్షించాలని శర్మ కోరారు. 
 
దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీవీఎంసీ అధికారుల నుంచి వివరణ కోరారు. ముడసర్లోవ పార్కు వద్ద పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేయొద్దని అధికారులను నిర్ధేశించారు. అయితే, ముడసర్లోవ వద్ద నిర్మాణాలేవీ చేపట్టడం లేదని, అలాంటి ప్రతిపాదనలు ఏవీ లేవని జీవీఎంసీ అధికారులు ఉప ముఖ్యమంత్రికి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు