అగస్త్య మహర్షి ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక పూజలు

ఠాగూర్

బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (12:52 IST)
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేరళ పర్యటనకు వెళ్ళారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను ఆయన సందర్శించనున్నారు. దీనిలో భాగంగా, బుధవారం ఆయన కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. 
 
పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరా నందన్, తితిదే పాలక మండలి సభ్యుడు ఆనంద సాయిలు ఉన్నారు. బుధవారం సాయంత్రం తిరువనంతపురంలోని పరశురాస్వామి ఆలయాన్ని పవన్ సందర్శించనున్నారు. మూడు రోజుల పర్యటనలో అనంత పద్మనాభస్వామి, మదురై మీనాక్షి ఆలయం, కుంభేశ్వర, స్వామిమలై, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర ఆలయాలకు పవన్ వెళ్ళనున్నారు. 


 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి ఈ రోజు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు.
కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి… pic.twitter.com/TEJYeyOAVO

— Vinutha Kotaa (@VinuthaKotaa) February 12, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు