ఈ పరీక్షల్లో ఆయనకు ఊపిరితిత్తులు స్వల్పంగా ఇన్ఫెక్షన్‌కు గురైనట్టు తేలింది. దీంతో ఆయన వైద్యులు పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుకల్లో పాల్గొన్న నిర్మాత బండ్ల గణేష్‌కు కూడా కరోనా రెండోసారి సోకిన విషయం తెల్సిందే.