నా పొలంలో కంకర తవ్వుకుంటే తప్పేంటి.. రైతు ప్రశ్న

శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (10:35 IST)
నవ్యాంధ్ర రాజధాని కోసం గత ప్రభుత్వం అనేక వేల ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించింది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని అమరావతిని అటకెక్కించింది. అయితే, రాజధాని నిర్మాణం కోసం శకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లేందుకు గత ప్రభుత్వం ఒక కంకర రోడ్డును నిర్మించింది. 

 
తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామానికి చెందిన రైతు గోవింద రెడ్డి ఈ స్థలాన్ని ఇటీవల కొనుగోలు చేశాడు. దీంతో రోడ్డు నిర్మాణం కోసం వాడిన కంకరను తవ్వేసి గ్రామంలో ప్రజా అవసరాల కోసం వినియోగించాడు. 

 
ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు తవ్వేసిన రోడ్డును పరిశీలించారు. దీనిపై ఆర్ఐ ప్రశాంతి ఒక నివేదికను తయారుచేసి తాహశీల్దారు శ్రీనివాసులు రెడ్డికి ఇచ్చారు. ఆయన ఫిర్యాదు మేరకు రైతు గోవింద రెడ్డిపై కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు