అదేవిధంగా మరో ట్వీట్ లో "జగన్ వచ్చారని... వరుణుడు పారిపోయాడా? సాగునీరు రాక ఉత్తరాంధ్ర ఉసూరుమంటోంది. చినుకు రాలక రాయలసీమ రాళ్లసీమలా కనిపిస్తోంది. గుక్కెడు నీటి కోసం ప్రకాశం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. తమ వల్లే వానొచ్చిందని, వరదొచ్చిందంటూ వైకాపా నేతలు మా జగనన్న భగీరధుడు అంటూ బిల్డప్ ఇస్తున్నారు.
ఇప్పటి వరకూ 3 జిల్లాల్లోనే సాధారణ, 10 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాలలో తాగేందుకు నీరివ్వమంటూ జనాలు ఆందోళనకు దిగుతున్నారు. మరి వరుణుడు ఏమయ్యాడు, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు అని తెలిసిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాడా?