మొదట్లో టీమిండియా మాజీలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ వంటి వారు కూడా కోచ్ పదవిపై ఆసక్తితో వున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే అండర్ 19 కెప్టెన్ గా ద్రవిడ్ యువ క్రికెటర్లను సమర్థవంతంగా తీర్చిదిద్దుతూ మంచి కోచ్ గా పేరుతెచ్చుకున్నాడు. అలాగే వీరేంద్ర సెహ్వాగ్ కు కూడా అంతర్జాతీయ క్రికెటర్ గా మంచి అనుభవం వుంది. కాబట్టి వీరిద్దరిలో ఎవరోఒకరు భారత జట్టుకు తదుపరి కోచ్ గా ఎంపికవనున్నట్లు ప్రచారం కూడా జరిగింది.
వీరు కూడా బిసిసిఐ విధించిన గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని భావించారట. అయితే ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగానే వెస్టిండిస్ పర్యటనకు వెళుతూ విరాట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రవిశాస్త్రికి బహిరంగ మద్దతు ప్రకటించాడు. మళ్లీ కోచ్ గా ఆయన్ను నియమిస్తే బావుంటుందని అన్నాడు. దీంతో సెహ్వాగ్, ద్రవిడ్ లే కాదు మరికొంత టీమిండియా మాజీలు కూడా వెనక్కి తగ్గినట్లు సమాచారం.