ఐదు నెలల క్రితం ఇల్లు ఖాళీచేసి చిక్కడపల్లి సూర్యనగర్‌లో రామస్వామి ఇంటిపక్కన అద్దెకు దిగాడు. అతడు కూడా జీహెచ్‌ఎంసీలో ఉద్యోగి. రామస్వామితో మహేందర్ సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో రామస్వామి కుమార్తె అర్చనకు 2007లో వివాహమైంది. ఆమెకు ఏడేళ్ల పాప ఉంది. నాలుగేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకొని తండ్రి వద్దే నివశిస్తోంది. మహేందర్ ఆమెతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు.
ఆమె వద్ద వెయ్యి రూపాయలు అప్పు తీసుకుని ఇవ్వలేదు. డబ్బులిస్తానని నారాయణగూడ బస్‌స్టాప్ వద్దకు రమ్మని గతనెల 7వ తేదీన ఆమెకు ఫోన్ చేశాడు. అర్చన వెళ్లగా నీ డ్రెస్ బాగాలేదు.. రూమ్‌కెళ్లి మార్చుకోమంటూ ఇంటికి తీసుకెళ్లాడు. క్లోరోఫామ్ ఉంచిన దస్తీని అర్చన ముక్కువద్ద ఉంచడంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన అతడు అర్చన మెడకు ప్లాస్టిక్ కవర్‌ను గట్టిగా బిగించి చంపేశాడు.