లాక్డౌన్‌లో దంపతుల వ్యభిచార దందా... అమ్మాయిలతో...

సోమవారం, 15 జూన్ 2020 (09:25 IST)
కరోనా వైరస్ దెబ్బకు దేశం మొత్తం లాక్డౌన్‌లో ఉంది. దీంతో అనేక మంది ఉపాధిని కోల్పోయారు. ఈ క్రమంలో పలువురు అడ్డదారుల్లో డబ్బు సంపాదనకు పాల్పడుతున్నారు. కొందరు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. మరికొందరు మత్తుపదార్థాలు, అక్రమ మద్యం విక్రయిస్తున్నారు. 
 
తాజాగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో డబ్బు సంపాదన కోసం ఓ యువ జంట వక్రమార్గం పట్టింది. అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ శివారు మైలార్‌దేవుపల్లిలో అబ్దుల్ మిస్కిన్ (30) దంపతులు అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.
 
ఇందులో భాగంగా షేక్ ముస్తాక్ (27) అనే ఆటో డ్రైవర్‌తో కలిసి ముంబై నుంచి ఇద్దరు యువతులను నగరానికి రప్పించారు. వీరితో పాతబస్తీ, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో వ్యభిచారం చేయిస్తున్నారు. విటులు ఫోన్ చేస్తే ముస్తాక్ తన ఆటోలో యువతులను వారింటికి తీసుకెళ్లి దిగబెట్టేవాడు.
 
ఇటీవల శాస్త్రిపురం డివిజన్‌లోని కింగ్స్ కాలనీలో వీరు ఓ ఇంటిలో అద్దెకు దిగారు. తర్వాత అక్కడికి అపరిచిత వ్యక్తులు వచ్చి పోతుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు