డియర్ హబ్బీ... తప్పు చేశా.. చచ్చిపోతున్నా.. మరో పెళ్ళి చేసుకో : డెంటిస్ట్ మాధవీలత

శుక్రవారం, 28 ఆగస్టు 2020 (09:51 IST)
ఇటీవల కర్నూలు జిల్లా నంద్యాలలో మహిళా దంతవైద్యురాలు మధవీలత ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని సుఖంగా సంసార జీవితాన్ని అనుభవిస్తున్న ఈమె.. ఉన్నట్టుండి ఇలాంటి విషాదకర నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలు మిస్టరీగా ఉండిపోయాయి. అయితే, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు డాక్టర్ మాధవీలత ఆత్మహత్యకు గల కారణాలు కనుగొన్నారు. తాను తప్పు చేశాననీ అందుకే చచ్చిపోతున్నట్టు పేర్కొంది. పైగా, తన భర్తను మరో పెళ్లి చేసుకోవాలని కోరింది. 
 
నంద్యాలకు చెందిన డెంటిస్ట్ మాధవీలత ఈ నెల 16వ తేదీన ఆత్మహత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇది స్థానికంగా తీవ్ కలకలం రేపింది. ఆమె భర్త మంచివాడేనని, తన కుమార్తెను చక్కగా చూసుకుంటాడని స్వయంగా మాధవీలత తల్లిదండ్రులు వెల్లడించారు. 
 
అదేసమయంలో మాధవీలత మృతదేహాన్ని వద్ద సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో ఏముందన్న విషయాన్ని బయటకు వెల్లడించలేదు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పైగా, తొలుత ఆ లేఖను బయటపెట్డడం లేదని చెప్పిన పోలీసులు తాజాగా దాన్ని బయట పెట్టారు.
 
ఈ లేఖలో మాధవీలత, తాను తప్పు చేశానని, తనను క్షమించాలని భర్తను ఉద్దేశించి రాసింది. చేసిన పొరపాటుకు మనస్తాపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. బాధ్యతగా కొడుకును చక్కగా చూసుకోవాలని భర్తను కోరింది. భర్తతో తాను బాధ్యతగా ఉండలేకపోయానని చెబుతూ, మరో వివాహం చేసుకోవాలని కోరింది. 
 
ఎవరైనా ఎందుకు నీ భార్య ఆత్మహత్య చేసుకుందని అడిగితే, ఓ వ్యాధితో బాధపడుతూ తట్టుకోలేక చనిపోయిందని చెప్పాలని రాసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు