కాలేజీ పక్కనే వ్యభిచారం దందా.. ఎవరికీ అనుమానం రాకుండా....

బుధవారం, 20 నవంబరు 2019 (07:45 IST)
గుంటూరు జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతూ వచ్చిన వ్యభిచార దందాను పోలీసులు బహిర్గతం చేశారు. ఈ వ్యభిచార నిర్వాహకులు పక్కా ప్రణాళికతో దీన్ని నిర్వహిస్తూ వచ్చారు. కాలేజీ పక్కన ఉండే హాస్టల్స్‌కు సమీపంలో ఈ వ్యభిచార కేంద్రాన్ని నడుపుతూ వచ్చారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు... ఈ కేంద్రంపై దాడి చేసిన పలువురు అమ్మాయిలతో పాటు.. ఆరుగురిని అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా చినకాకాని ప్రాంతంలో ప్రైవేటు కళాశాలల హాస్టళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతం విద్యార్థులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ఓ వ్యభిచార ముఠా ఇక్కడ దందా ప్రారంభించింది.
 
ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచార కేంద్రాన్ని ప్రారంభించింది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తూ వచ్చింది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు... దాడులు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు విటులు, నలుగురు నిర్వాహకులు ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు