కోడి పందేలను నిషేధించాలని కొంత మంది మానవతావాదులు కోరడం.. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజా ప్రతినిధులు సైతం కోడి పందేలల్లో పాల్గొనడం కామన్ అయిపోయింది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంటుంది. ఇక అసలు విషయానికి వస్తే... కోడిపందేల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధుల వివరాలను డీజీపీ మాలకొండయ్య హైకోర్టుకు సమర్పించారు.
ఈ నివేదికలో కాకినాడ ఎంపీ తోట నర్సింహం, పిఠాపురం ఎమ్మెల్యే వి.సత్యనారాయణ వర్మ, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు, పోలవరం ఎమ్మెల్యే ఎం.శ్రీనివాసరావు, పెనమలూరు బోడె ప్రసాద్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు బుడ్డా వెంకటేశ్వరరావు, యలమంచిలి వెంకటబాబుతో పాటు.. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లలోని పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచిల పేర్లు నివేదికలో ప్రస్తావించారు.