వైకాపా నేత, సినీ రచయిత పోసాని కృష్ణమురళిని పోలీసులు కర్నూలు నుంచి విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీటీ వారెంట్పై కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయనను ఇక్కడకి తీసుకొచ్చారు. విజయవాడ కోర్టులో ఆయనను హాజరుపరుస్తారు. ఒకవేళ కోర్టు పోసానికి రిమాండ్ విధిస్తే విజయవాడ జైలుకు తరలించే అవకాశం ఉంది. రిమాండ్ విధించనిపక్షంలో మరోమారు కర్నూలు జైలుకు పంపిస్తారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను పోసానిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, గత వైకాపా ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై, మీడియా సంస్థలపై దూషణలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంపై పలు పోలీస్ స్టేషన్‌లలో పోసాని కృష్ణమురళిపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదైవున్నాయి. ఈ కేసుల్లో ఒక్కొక్కటిగా పోలీసులు పోసానిని అరెస్టు చేస్తున్నారు.
కాగా, గత వైకాపా అధికారంలో ఉన్నపుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ సభ్యులు, చిరంజీవి తల్లి అంజనా దేవి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత నారా లోకేశ్‌లతో పాటు వైకాపా మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజులను శ్రీరెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే.