జగన్ విధ్వంస పాలనకు ప్రతీక ప్రజావేదిక శిథిలాలు, సీఎం చంద్రబాబు పరిశీలన (vedio)

ఐవీఆర్

గురువారం, 20 జూన్ 2024 (12:25 IST)
2019లో అధికారం చేపట్టిన వెంటనే ఆనాటి సీఎం జగన్ చేపట్టిన తొలి కూల్చివేత ప్రజావేదిక నుంచి ప్రారంభమైంది. నేడు ఆ ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు సీఎం చంద్రబాబు. అమరావతి పర్యటనలో భాగంగా ఉండవల్లిలో జగన్ రెడ్డి కూలగొట్టిన ప్రజావేదిక ప్రాంతాన్ని సందర్శించారు.
 
జగన్ విధ్వంస మనస్తత్వానికి శిథిల సాక్ష్యం ఈ ప్రజావేదిక అనీ, 5 ఏళ్ళ నుంచి ప్రజా వేదిక వ్యర్ధాలు కూడా తీయకుండా, అక్కడే ఉంచి పైశాచిక ఆనందాన్ని జగన్ రెడ్డి పొందారంటూ తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
జగన్ విధ్వంస పాలనకు ప్రతీక ప్రజావేదిక అని, ఆ శిథిలాలను తొలగించం అని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

అమరావతి పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో జగన్ రెడ్డి కూలగొట్టిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు.

జగన్ విధ్వంస మనస్తత్వానికి శిథిల సాక్ష్యం ఈ ప్రజావేదిక. 5 ఏళ్ళ నుంచి ప్రజా వేదిక వ్యర్ధాలు కూడా తీయకుండా, అక్కడే ఉంచి పైశాచిక ఆనందం పొందిన జగన్.… pic.twitter.com/nWfcNcWN5r

— Telugu Desam Party (@JaiTDP) June 20, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు