ప్రభుత్వ గుర్తింపు కోసం... ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలి..

సోమవారం, 11 డిశెంబరు 2017 (19:29 IST)
అమరావతి: రాష్ట్రంలో అనధికారికంగా పనిచేస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు తక్షణమే ప్రభుత్వ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర హోమ్ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్. అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ చట్టం 2008 అనుసరించి, రాష్ట్రంలో ఉన్న సెక్యూరిటీ సంస్థలన్నీ ప్రభుత్వ గుర్తింపు కలిగి ఉండాలన్నారు. 
 
తక్షణమే అనధికారికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేటు ఏజెన్సీలు తమ గుర్తింపు కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ చట్టం 2008 నిబంధనలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ గుర్తింపు లేకుండా కార్యకలాపాలు నిర్వహించే ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల వివరాలు APSecurityAgency వెబ్ సైట్లో లభ్యమవుతాయని రాష్ట్ర హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్.అనురాధ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు