రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణ కరువు: డిసిసి మైనారిటీ ఉపాధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్

సోమవారం, 13 సెప్టెంబరు 2021 (23:13 IST)
రాష్ట్రంలో ఎక్కడ చూసినా దురాక్రమణలు, కబ్జాలు,అవినీతి, అన్యాయం, పెరిగిపోయిందని కడప జిల్లా డి సి సి మైనారిటీ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షుడు ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్, స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎస్.అల్లా బకష్ (సీఎల్పీ) అన్నారు.

తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూవైకాపా పాలనలో సామాన్యమైన వ్యక్తి  బతకాలంటే ఇటు అధికారులకు అటు వై సి పి నాయకులకు భయపడి బతికే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల ఆస్తులకు ధన మాన ప్రాణాలకు నేడు రక్షణ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా మైదుకూరు నివాసి అక్బర్ అలీ కుటుంబం పై పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడం దుర్మార్గపు చర్యగావారు భావించారు.

అక్బర్ అలీ కుటుంబానికి రక్షణ కల్పించే పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోని న్యాయం చేయాలి. వెంటనే  తిరుపాల్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలవి వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెల్ జిల్లా అధ్యక్షుడు చెన్నై కృష్ణ, మైనార్టీ నాయకుడుయహియా భాష పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు