పూతలపట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తనకు సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేయడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు ఈసారి సీటు దక్కే అవకాశం లేదన్న సంకేతాలు అందాయి. ఇటీవల కుటుంబ సభ్యులతో కలసి జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లినా అది సాధ్యం కాలేదు.