భవానీ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచి అందుబాటులోకి..

గురువారం, 15 డిశెంబరు 2022 (10:55 IST)
బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భవానీ భక్తుల కోసం విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడిపేలా దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఈ ప్రత్యేక రైల్లు కూడా నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. 
 
శ్రీకాకుళం రోడ్ - వరంగల్ మీదుగా నడిచే ప్రత్యేక రైలు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు వరంగల్‌కు చేరుకుంటుంది. అలాగే, వరంగల్ బరంపురం ప్రత్యేక రైలు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వరంగల్‌‍లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 11.15 గంటలకు బరంపురం చేరుకుంటుంది. 
 
బరంపురం - విజయవాడ రైలు ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి తర్వాత రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ - బరంపురం మధ్య ఈ నెల 15 నుంచి 20 తేదీల మధ్య ప్రతి రోజూ విజయవాడలో రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు బరంపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు బరంపురంలో మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు చేరుకుంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు