తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది. దీంతో అనేక ప్రాంతాల్లో కోళ్లు వందల సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ కారణంగా చికెన్ విక్రయాలు పడిపోయాయు. ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న భయాన్ని, అపోహలను తొలగించేందుకు వివిధ ప్రాంతాల్లో చికెన్ మేళాలను నిర్వహిస్తున్నారు. వీటికి చికెన్ ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది.
వంద డిగ్రీల వేడితో చికెన్ ఉడికించి తినడం వల్ల బర్డ్ ఫ్లూ మనిషికి వచ్చే అవకాశం లేదని తెలియజేసేందుకే ఈ మేళా ఏర్పాటు చసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్డు అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిందని, పౌల్ట్రీ రంగానికి అపారనష్టం వాటిల్లిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేళాకు ప్రజల నుంచి మంచి స్పందన లభించడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని వారు తెలిపారు. కాగా, బర్డ్ ఫ్లూ భయంతో గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చికెన్ వంటకాలను ఆరగించడం మానేయడంతో వీటి విక్రయాలతో పాటు ధరలు కూడా ఒక్కసారిగా పడిపోయాయి.