రామోజీ రావు అంతిమ యాత్ర ప్రారంభం.. ముందే సిద్ధం చేసుకున్న స్మారక స్థలం

వరుణ్

ఆదివారం, 9 జూన్ 2024 (09:57 IST)
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన యాత్ర.. ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వరకు కొనసాగనుంది. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. కుటుంబసభ్యులు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు తెలిపారు.
 
రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. రామోజీరావు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. 
 
కాగా, రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఫిలింసిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను సీఎస్ శాంతి కుమారి జారీచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారులు పాల్గొననున్నారు. రామోజీరావు మృతికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆది, సోమవారాలు సెలవుదినంగా ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు