ఇంటింటికీ బియ్యం పంపిణీ జరుగుతోందన్నది మాటలకే తప్ప వీధివీధికి ఒక చోట ఇస్తున్నారు. అందులో సర్వర్ కూడా సక్రమంగా పనిచేయకపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. పంపిణీ వాహనం వచ్చే సమయాన్ని చెప్పేవారు లేరని, దీంతో వాహనం కోసం ఎదురుచూడాల్సిన వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
వాహనం వచ్చినప్పుడు లేకపోయామా.. ఇక అంతే సంగతులు... మరో నెలపాటు రేషన్ సరుకుల కోసం ఎదరుచూడాల్సిందేనంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా తమకు తీరికి ఉన్న సమయంలో డీలర్ల వద్ద వెళ్లి సరుకులు తెచ్చుకునేవారమని, ఈ కొత్త పద్ధతితో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు.