ఏపీలో భానుడి ప్రతాపం... కర్నూలులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత...

ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (16:32 IST)
ఆంధ్రప్రదేశ్‌లో సూర్యభగవానుడి ప్రతాపం కొనసాగుతోంది. వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో పగటి పూట రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు వణికిపోతున్నారు. ఉక్కపోతతో తల్లడిల్లిపోతున్నారు. 
 
ముఖ్యంగా, రాయలసీమలో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో సాధారణంగా కంటే ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఆదివారం కర్నూలులో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 
 
అనంతపురం, తిరుపతిలో 41, నెల్లూరులో 40, విజయవాడ, రాజమహేంద్రవరంలో 39, ఒంగోలు, శ్రీకాకుళంలో 37, నర్సాపురం, విశాఖపట్నంలో 36డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి