Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

సెల్వి

శుక్రవారం, 21 మార్చి 2025 (08:21 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని మండే ఎండలతో బాధపడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించింది. సోమవారం వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అంచనా ప్రకారం, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మెరుపులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
 
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. దీనివల్ల ప్రజలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఉష్ణోగ్రత పెరగడంతో విద్యుత్ వినియోగంలో గణనీయమైన పెరుగుదలకు దారితీసింది. ఈ పరిస్థితులలో, మూడు రోజుల పాటు కురిసే వర్షాలు వాతావరణాన్ని చల్లబరుస్తాయని, దీంతో వేడిమి తీవ్రత తగ్గడం ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు