ఎపిఐఐసి ఛైర్ పర్సన్ నుంచి రోజాను తొలగించారు. ఇక ఆమెకు మంత్రి పదవి కూడా లేనట్లే అంటూ రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం నగరిలోనే కాదు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ప్రచారం జరుగుతుండానే నామినేటెడ్ పదవుల్లో ఎపిఐఐసి ఛైర్మన్ పదవిని వేరే వారికి కట్టబెట్టేశారు. దీంతో ఒక్కసారిగా ప్రచారం మరింత ఎక్కువైంది.
కుటుంబ సమేతంగా ఆమె స్వామి సేవలో పాల్గొన్నారు. ఎంతో ఆనందంగా కనిపించారు రోజా. ఈసారి కేబినెట్లో రోజాకు మంత్రి పదవి ఖాయమంటూ ఆమె సన్నిహితులు ధీమాతో ఉన్నారు. రోజా కూడా ఆ ధీమాతోనే ఉన్నారని.. జగనన్నను నమ్ముకుని వారికి ఎక్కడా అన్యాయం జరుగదని చెబుతున్నారు రోజా సన్నిహితులు. మరి చూడాలి త్వరలో జరగబోయే కేబినెట్ ఎంపికలో రోజాకు మంత్రి పదవి లభిస్తుందో లేదోనన్నది...!