అనకాపల్లి జిల్లాలో రాయల్ బెంగాల్ టైగర్ సంచారం

గురువారం, 30 జూన్ 2022 (11:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో రాయల్ బెగాల్ టైగర్ సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. పైగా, టైగర్ ఒక గేదెను కూడా చంపి ఆరగించినట్టు వారు ఆధారాలు చూపిస్తున్నారు. పైగా, కోటవురట్ల మండలం, టి.జగ్గంపేట సమీపంలోని జీడిమామిడి తోటలో దాని పాదముద్రలను గుర్తించారు. 
 
అలాగే, శ్రీరాంపురం సమీపంలోని జీడితోటలో గేదెను కూడా అది చంపి తిన్నట్టు స్థానికులతో పాటు అధికారులు కూడా గుర్తిచారు. పైగా, దాని పాదముద్రలను నిశితంగా పరిశీలించిన అటవీశాఖ అధికారులు ఈ టైగర్ రాయల్ బెంగాల్ టైగర్‌గా గుర్తించారు.
 
అయితే, గేదెను చంపి ఆరగించిన తర్వాత ఈ టైగర్ సమీపంలోని కొండపైకి వెళ్లిపోయింది. పైగా, ఇది మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉండటంతో స్థానికులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. 
 
దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. గేదెను చంపిన ప్రాంతానికి 30 కిలోమీటర్ల రేడియల్ ప్రాంతంలో ఈ పులి సంచరించే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల వాసులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు