సండ్రకు మినిస్టర్ బెర్త్ ఖరారు... టీడీపీకి గుడ్‌బై?

శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (14:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి) పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో బెర్తు ఖరారుకావడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసి తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన ఈనెల 19వ తేదీలోపు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే, ఈనెల 19వ తేదీన కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. 
 
నిజానికి టీటీడీ పాలకమండలి సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య నియామకం రద్దయ్యింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమితుడైన సండ్ర వెంకటవీరయ్య... నిబంధనల ప్రకారం నెల రోజుల్లో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే నెల రోజులు దాటినా... ఆయన బాధ్యతలు తీసుకోకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున తెలంగాణ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య... అధికార టీఆర్ఎస్‌లోకి వెళతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై సండ్ర స్పందించిక పోయినప్పటికీ ఆయన అనుచరులు మాత్రం సండ్ర టీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చించుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు