జనవరి 16 నుంచి బాపట్ల సూర్యలంకలో మిలటరీ శిక్షణ... 100 కి.మీ వరకూ వార్నింగ్

బుధవారం, 6 డిశెంబరు 2017 (21:36 IST)
అమరావతి: భారత మిలటరీ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక వద్ద సాయుధ దళానికి(నేవీ) శిక్షణ ఇవ్వనున్నారు. జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకూ 15 రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ విషయమై రాష్ట్ర పొలిటికల్ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 
 
జనవరి 16, 17, 18, 19, 20, 23, 24, 25, 26, 27, 30, 31, తేదీలతో పాటు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో 15 రోజుల శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ శిక్షణా కార్యక్రమం జరుగనుందన్నారు. శిక్షణలో భాగంగా కాల్పుల శిక్షణ అనివార్యమైనందున సూర్యలంక చుట్టుపక్కల 100 కిలో మీటర్ల వరకూ అపాయకరమన్నారు. దీనిపై సూర్యలంకలో శిక్షణ నిర్వహించే ప్రాంతం చుట్టుపక్కల ప్రజలను హెచ్చరించాలని గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు, బాపట్ల ఆర్డీవో, తహసీల్దార్లకు ఆ ప్రకటనలో ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు