ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

మంగళవారం, 1 డిశెంబరు 2020 (07:35 IST)
నివర్ తుపాను మిగిల్చిన తీవ్ర నష్టం మరవక ముందే మరో వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది.

తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితలం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మరే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

డిసెంబర్ 2న వాయుగుండం దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు