రోజా తనయ అదరగొట్టింది... యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫొటో!

శనివారం, 2 అక్టోబరు 2021 (17:14 IST)
Roja daughter
90టీస్‌లో స్టార్ హీరోయిన్‌గా అలరించిన రోజా ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్యేగా వున్నారు. జబర్దస్త్ కామెడీ షో లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ.. కమెడియన్లకు పంచ్ లు వేసి నవ్వుతూ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. అయితే సెల్వమణిని వివాహం చేసుకున్న రోజా అన్షు మల్లిక్‌, కృష్ణ లోహిత్ అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
 
రోజా తన పిల్లలని చాలా గారాబంగా పెంచుతుంది. వారికి అభిరుచులకి ఏ రోజు ఎదురు చెప్పదు.అయితే ఈ కాలం పిల్లలు అంతా ఆధునిక ఐటీ ఫ్యాషన్ సహా ఇన్నోవేషన్ రంగాల్లో ముందుకెళుతుంటే.. రోజా కూతురు మాత్రం సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించి భాషపై పట్టు సాధించి సృజనాత్మకతతో ముందుకెళుతోంది. తాజాగా అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత అన్షు ఎన్సర్ యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫొటోను ప్రచురించడం విశేషం.
 
తనకు అరుదైన గుర్తింపు దక్కడం పట్ల స్పందించిన అన్షూ.. తన కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేసింది. కాగా ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై క్వీన్ ఆఫ్ టాలెంట్ గా ఆమె ఫొటో వేశారు. రీసెంట్‌గా అన్షు మాలిక తన పుట్టినరోజు జరుపుకోగా, ఆ వేడుకలని రోజా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు