సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు వారిపై వైఎస్ షర్మిల మద్దతు పలికారు. అనుచిత పోస్టులకు హెడ్ అయిన సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరారు. అతడు జగన్ ఇంట్లో దాగి ఉన్నా సరే అరెస్ట్ చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
సోషల్ మీడియా పోస్టులు ఎంపీ అవినాశ్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అవినాశ్ రెడ్డిని పోలీసులు ఎందుకు విచారించలేదు?' అని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె వినూత్మ నిరసన చేపట్టారు. కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టు అంటూ కొబ్బరికాయలతో కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు.
కడప స్టీల్ ప్లాంట్‌పై పాలకులకు ఎందుకంత చిన్నచూపే అర్థం కావడం లేదు. వివేకా హత్య కేసులో వేగం పెరగడం శుభపరిణామం. ఇప్పటికైనా సునీత, సౌభాగ్యమ్మకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. బాధితురాలైన సునీతకు తానెప్పుడూ అండగానే ఉంటానని షర్మిల చెప్పారు.