రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు కమీషన్లు తీసుకోకపోతే.. పనులు జరగవని చాలామంది అనుకుంటూవుంటారు. కానీ సిరిసిల్ల ఛైర్ పర్సన్ పావని కూడా ఈ వార్తలను నిజమని తేల్చారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ తీసుకుంటున్నామని బాంబు పేల్చారు.
తాము ఎన్నికల్లో ఎంతో ఖర్చు పెట్టామని, కాంట్రాక్టర్ల నుంచి 3 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నామని ఓ పట్టణ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్, తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ మహిళా నేత వ్యాఖ్యానించడం ప్రస్తుతం వివాదానికి దారితీసింది.