వాగులో ఆరుగురు దుర్మరణం: ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారమివ్వాలంటున్న లోకేష్
గురువారం, 29 అక్టోబరు 2020 (14:53 IST)
పశ్చిమగోదావరి జిల్లాలో వేలేరు పాడు మండలం, భూదేవి పేట గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు వసంతవాడ పెదవాగు బ్రిడ్జ్ ప్రాంతానికి వనభోజనానికి వెళ్లి సరదాగా స్నానానికి పెదవాగిలో దిగి మునిగిపోయారు. వారంతా నీట మడుగులో జారడంతో ఈ పెను ప్రమాదం చోటుచేసుకున్నది.
దీనిపై టీడీపీన నేత నారా లోకేశ్ స్పందిస్తూ పోలవరం నియోజక వర్గం భూదేవి పేట గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు వాగులో పడి మరణించడం విషాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి తన సానుభూతిని చెలియజేసుకుంటున్నాని తెలిపారు.
ఎంతో భవిష్యత్తు కలిగిన పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి నష్ట పరిహారంగా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.