చిత్తూరు జిల్లాలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:29 IST)
చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి నుంచి కర్ణాటకలోని కోలారు వరకు సినిమా ఫక్కీలో రెండు వాహనాలను ఛేజ్‌ చేసి ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లును టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కారులోని 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలు కలిగిన కారు, దీనికి ముందు వెళ్ళిన పైలట్‌ కారు, ఐతేపల్లి వద్ద విడిచి వెళ్లిన మరో కారును స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం రేంజ్‌ డిఐజి కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డీఎస్పీలు వెంకటయ్య, వివి గిరిధర్‌లకు అందిన సమాచారం తో ఆర్‌ఎస్‌ ఐలు ఎం. వాసు, సురేష్‌, డీఆర్వో నరసింహ రావు టీమ్‌ చంద్రగిరి సమీపంలో కూంబింగ్‌ చేపట్టారు.

ఐతేపల్లి వద్ద కర్నాటకకు చెందిన మూడు వాహనాలు ఉండగా, ఒక వాహనంలో ఎర్రచందనం దుంగలు లోడ్‌ చేస్తూ కనిపించారని డీఎస్పీ వివి గిరిధర్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌ వాహనాలను చుట్టు ముట్టడంతో, ఒక కారును విడిచి పెట్టి, మిగిలిన రెండు కార్లలో వేగంగా తప్పుంచుకున్నారని చెప్పారు.

దీంతో వాసు టీమ్‌ ఆ వాహనాలను అదే వేగంతో వెంబడించారు. చిత్తూరు మీదుగా కర్నాటక సరిహద్దుల వరకు ఛేజ్‌ చేసుకుంటూ వెళ్లారు. కోలారు సమీపంలోని నేర్నహల్లి గేటు వద్ద వారి కారు పంక్చర్‌ కావడంతో వారిని అటకాయించగలిగారు.

వాహనంలోని 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు స్మగ్లర్లునూ అరెస్టు చేశారు. వీరిలో నలుగురు కర్నాటకకు చెందిన వారున్నారు. ఒకరు ఐతే పల్లి, మరొకరు చంద్రగిరికి చెందిన వారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు