ఎన్నికలంటే పోటీలో ఉన్న అభ్యర్థులు తమ అనుచరులు, బంధువులతో ఇంటింటి ప్రచారంలోకి దిగుతారు. చేతిలో ఎన్నికల గుర్తులకు సంబంధించిన కరపత్రాలు, భుజాన జెండాలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.
కోనసీమలోని సఖిలేటిపల్లి, రాజోలు, మలికీపురం మండలాలతో పాటు ఏజెన్సీ గ్రామాల్లో కూడా వాట్సాప్ పబ్లిసిటీ నడుస్తోంది. అంబాజీపేట మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి తాను 20 ఏళ్లుగా గ్రామానికి చేసిన సేవను వీడియో రూపంలో రిలీజ్ చేసి షేర్ చేస్తున్నారు. మరో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎమ్మెల్యే స్థాయిలో ప్రచారం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.