జగన్ రోడ్డెక్కి ప్రశ్నిస్తే ఏం చేస్తాం? సభలోకొస్తేనే... సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి

సోమవారం, 20 నవంబరు 2017 (21:51 IST)
అమరావతి: శాసనసభలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. శాసనసభలో, మండలిలో ప్రశ్నలు అడిగి అధికారికంగా సమాధానాలు రాబట్టవలసిన ప్రతిపక్షం వారు రోడ్డెక్కి ప్రశ్నించడం ఇదే మొదటిసారన్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ నేత జగన్మోహన రెడ్డి, ఎమ్మెల్యే రోజా, ఇతర ప్రతిపక్ష సభ్యులు సభలో లేకపోవడం తానైతే మిస్ అవుతున్నానని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్ళించడం వల్ల రాయలసీమ జిల్లాలకు కృష్ణా నది నీటిని సాగునీరు, త్రాగు నీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఏర్పడిందని చెప్పారు.
 
పట్టిసీమ ద్వారా గోదావరి నీరు కృష్ణా నదికి చేరడం వల్ల కృష్ణ ఆయనకట్టుకు ముందుగానే నీరు ఇచ్చారని, ఆ రకంగా పంటలు కూడా ముందుగానే చేతికి వచ్చాయని తెలిపారు. కృష్ణకు అదనంగా నీరు చేరడం వల్ల ఆ నీటిని కెసీ కెనాల్, హంద్రీ-నివా సుజల స్రవంతి ఎత్తిపోతల, గాలేరు-నగరి, గండికోట-సీబీఆర్ లిఫ్ట్ పథకం ద్వారా రాయలసీమ జిల్లాలకు సాగునీరు, త్రాగు నీరు అందుతుందని వివరించారు. ఇటు కృష్ణ ఆయకట్టుకుగానీ, అటు రాయలసీమకు గానీ లక్షల ఎకరాలకు సాగునీరు అందనంగా అందించామన్నారు. ఆ రకంగా పట్టిసీమ ఓ వరం అన్నారు.
 
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం అంశంపై శాసనసభలో మూడు సార్లు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినట్లు మంత్రి సోమిరెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని ఆశాస్ట్రీయంగా విభజించుట వల్ల మూడేళ్ల తర్వాత కూడా లోటు బడ్జెట్ లో ఉన్నామన్నారు. నీతి ఆయోగ రూ.22 వేల కోట్లు లోటు ఇవ్వాలని సిఫారసు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రూ.44 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు లు పూర్తి అయితే అవి సంపాదనను సృష్టిస్తాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రైతుల రుణాలు దశలవారీగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఒక వారం పది రోజుల్లో మరో వెయ్యి కోట్లు రైతుల ఖాతాలకు జమ అవుతాయని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు