దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో భారత 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన వివిధ రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటం సందర్శకులను అమితంగా ఆకర్షించింది.