ఆనంతరం మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు.
ఆర్జితసేవలు రద్దు :
ఈ ఉత్సవాల కారణంగా జనవరి 15న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
14వ తేదీ వరకు తిరుమలలో విష్ణు బిల్వార్చన
పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకొని తిరుమలలోని వసంత మండపంలో జనవరి 10 నుండి 14వ తేదీ వరకు ఉదయం 6 నుండి 6.45 గంటల వరకు టీటీడీ విష్ణు బిల్వార్చన నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.